News January 28, 2025
రాజమండ్రి: బాలల సంరక్షణ గృహానికి నిందితుడు

రాజమండ్రి వీరభద్రపురంలో ఈ నెల 24వ తేదిన జరిగిన కిలారి పోతురాజు హత్య ఘటనలో నిందితుడు మైనర్ కావడంతో అతడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు తెలిపారు. న్యాయమూర్తి ఆదేశాలు మేరకు బాలల సంరక్షణ గృహానికి తరలించామన్నారు. పోతురాజు హత్యపై దర్యాప్తు చేసి బాలుడిని నిందితుడుగా గుర్తించామన్నారు. ఈ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమని ఇన్స్పెక్టర్ తెలిపారు.
Similar News
News September 15, 2025
ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం: జగన్

AP: 1923 – 2019 వరకు రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలుంటే, తమ హయాంలో 17 కాలేజీలను సంకల్పించామని YCP చీఫ్ జగన్ అన్నారు. ‘2023 SEP 15న VZM, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ప్రారంభించాం. పాడేరు, పులివెందుల కళాశాలలను అడ్మిషన్లకు సిద్ధం చేశాం. మిగతా కాలేజీల పనులు చేయకుండా వాటిని ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం. ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
News September 15, 2025
కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్లేక్ అపార్ట్మెంట్లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.
News September 15, 2025
KNR: ‘పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి’

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు జిల్లాలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం పోషణ మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు.