News January 28, 2025
రాజమండ్రి: బాలల సంరక్షణ గృహానికి నిందితుడు

రాజమండ్రి వీరభద్రపురంలో ఈ నెల 24వ తేదిన జరిగిన కిలారి పోతురాజు హత్య ఘటనలో నిందితుడు మైనర్ కావడంతో అతడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు తెలిపారు. న్యాయమూర్తి ఆదేశాలు మేరకు బాలల సంరక్షణ గృహానికి తరలించామన్నారు. పోతురాజు హత్యపై దర్యాప్తు చేసి బాలుడిని నిందితుడుగా గుర్తించామన్నారు. ఈ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమని ఇన్స్పెక్టర్ తెలిపారు.
Similar News
News February 13, 2025
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. నెల్లూరు జిల్లాలో చెక్‌పోస్టుల ఏర్పాటు

నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకకుండా చర్యలు తీసుకున్నామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ నాయక్ తెలిపారు. మనుబోలు పశు వైద్యశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో ఆరు చోట్ల చెక్‌పోస్ట్‌ల నుంచి ఇతర జిల్లాల నుంచి కోళ్ల రవాణాను అడ్డుకుంటామన్నారు. ఉడికించిన మాంసం, గుడ్లను నిర్భయంగా తినవచ్చు అన్నారు.
News February 13, 2025
అప్పుడు పంత్‌ను కాపాడి.. ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు

2022లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి క్రికెటర్ రిషభ్ పంత్‌ను కాపాడిన యూపీ యువకుడు రజత్(21) ప్రస్తుతం చావుతో పోరాడుతున్నాడు. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని ఈనెల 9న ప్రియురాలు మన్నూతో కలిసి అతడు విషం తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరినీ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే నిన్న మన్నూ మృతి చెందగా రజత్ పరిస్థితి విషమంగా ఉంది.
News February 13, 2025
వంశీ అరెస్టు సరికాదు: బొత్స

AP: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు తగవన్నారు. తొమ్మిది నెలల అధికారాన్ని కూటమి ప్రభుత్వం వృథా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని విమర్శించారు.