News February 10, 2025

రాజమండ్రి: బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ.. ట్రాఫిక్ జామ్

image

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ కొట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో సుమారు రెండు గంటలు పాటు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు బ్రిడ్జిపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సిబ్బంది సకాలంలో చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Similar News

News November 26, 2025

రాజమండ్రి: మాక్ అసెంబ్లీ విజేతలకు కలెక్టర్ అభినందన

image

విద్యాశాఖ నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం కలెక్టర్ కీర్తి చేకూరి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీలో 8 మంది విద్యార్థులు, జిల్లా స్థాయిలో 13 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆమె తెలిపారు.

News November 26, 2025

రాజ్యాంగ స్ఫూర్తితో బాధ్యతలు నిర్వర్తించాలి: కలెక్టర్

image

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి డా. బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిజాయితీ, కర్తవ్య నిబద్ధతతో నిర్వర్తించాలని కోరారు. ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీతో రాజ్యాంగ స్ఫూర్తితో మెలగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

News November 26, 2025

రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ విస్తరణ

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్‌లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్‌లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్‌లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.