News June 13, 2024

రాజమండ్రి: భరత్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: ఆదిరెడ్డి

image

మాజీ ఎంపీ మార్గాని భరత్‌ అవినీతి అక్రమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌‌గా మారారని, ఆయన అరాచకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హెచ్చరించారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర మాజీ ఎంపీ మురళీ మోహన్‌, భరత్‌ హయాంలో వేసిన శిలాఫలకాలను ఆదిరెడ్డి తన సొంత డబ్బులతో గురువారం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భరత్ అభివృద్ధి పేరిట నగరంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు

Similar News

News October 2, 2024

కాకినాడలో మూడుసార్లు పర్యటించిన మహాత్మా గాంధీ

image

స్వాతంత్రోద్యమకాలంలో మహాత్మాగాంధీ కాకినాడలో మూడుసార్లు పర్యటించారు. 1921 ఏప్రిల్‌ 3న కాకినాడలో గాంధీజీ దంపతులు, వారి నాలుగో కుమారుడు రైలు దిగారు. గుర్రపు బండిపై పెద్ద బజారు గుండా జగన్నాథపురంలోని పైడా వెంకట నారాయణ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత 1930, 1933లలో రెండుసార్లు కాకినాడ వచ్చిన గాంధీ స్వాతంత్రోద్యమ సభల్లో పాల్గొన్నారు. ఈ విధంగా ఆయనకు తూర్పు గోదావరి జిల్లాతో సంబంధం ముడిపడి ఉంది.

News October 2, 2024

కోనసీమ: పట్టభద్రులూ.. ఓటు నమోదు చేసుకోండి

image

గతంలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు నమోదు చేసుకున్న ఓటు ప్రస్తుతం ఉండదని ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని మండపేట ఎన్నికల డీటీ అవతార్ మెహర్ బాబా పేర్కొన్నారు. మండపేట తహశీల్దార్ కార్యలయంలో మంగళవారం రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021 అక్టోబర్ 31 నాటికి పట్టభద్రులైన వారు ఓటరుగా నమోదయ్యేందుకు అర్హులన్నారు.

News October 1, 2024

రాజానగరం: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్

image

నన్నయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోని భర్తీ చేయని సీట్లకు ఈనెల 5న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాలలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.