News January 28, 2025
రాజమండ్రి: మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య

హుకుంపేట డీబ్లాక్ చెందిన నేదునూరి సంతోష్‌కుమార్(25) కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా మద్యానికి బానిసై మనస్థాపం చెందడంతో సోమవారం మధ్యాహ్నం ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య లీలాకుమారి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఎస్సై ఆర్ అంకారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.
Similar News
News February 13, 2025
కొవ్వూరులో హీరో రామ్ సినిమా షూటింగ్

సినీ హీరో రామ్ పోతినేని 22వ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. మంగళవారం ఆరికిరేవుల స్నానఘట్టం, గోదావరి నది వద్ద సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్‌గా భాగ్యశ్రీ ,రావు రమేష్, బ్రహ్మానందం, హర్షవర్దన్‌లు నటిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపారు.
News February 12, 2025
తూ.గో: చికెన్, గుడ్ల సరఫరా నిలిపివేత

కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో తూ.గో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ హాస్టల్స్‌లో గుడ్లు, చికెన్ సరఫరాను నిలిపివేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి శోభారాణి తెలిపారు. గుడ్లకు బదులుగా బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు, ఆదివారం మటన్ కర్రీ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వార్డెన్లకు సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని స్కూళ్లలో గుడ్ల సరఫరా నిలిపివేశారు.
News February 12, 2025
తూ.గో: వండిన చికెన్‌నే తినాలి

తూ.గో జిల్లా పెరవలి మండలంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వండిన చికెన్ మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకూ ఉడకపెట్టాలన్నారు. చికెన్, గుడ్లు చేతితో తాకితే శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఎవరికైనా జ్వరం, తలపోటు, జలుబు లక్షణాలు వస్తే వైద్య సిబ్బందికి సమాచారం అందిచాలన్నారు.