News January 25, 2025
రాజమండ్రి : మహిళను వేధించి హత్యాయత్నం.. జైలు

కాకినాడలోని వాకలపూడి వాసి వెంకన్న (25)కు రాజమండ్రి 8వ జిల్లా సెషన్స్ జడ్జి 9ఏళ్ల జైలు, రూ. 7 వేలు జరిమానా విధించారు. కాగా నిందితుడు ఓ మహిళను లైంగికంగా వేధించి , హత్యాయత్నం చేశాడని 2022లో అప్పటి ఎస్సై వి. మౌనిక కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.
Similar News
News November 18, 2025
రాజమండ్రి: నారా లోకేశ్ పర్యటన వాయిదా.. కారణం ఇదే

నవంబర్ 20న రాజమహేంద్రవరం సిటీలో జరగాల్సిన రాష్ట్ర ఐటీ,విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు నగర టీడీపీ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ నెల 20వ తేదీన నితీష్కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి లోకేశ్ కూడా హాజరుకానున్నారు. అందువలనే పర్యటన వాయిదా పడినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.

రాజమండ్రి: ఒకేసారి రెండు పథకాల డబ్బులు..!

తూర్పు గోదావరి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా 1,14,991 మంది లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు డీఏఓ ఎస్.మాధవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ కింద రూ. 57.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 5000), పీఎం కిసాన్ కింద రూ. 19.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 2000) మంజూరయ్యాయి. మొత్తం రూ. 77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.