News February 3, 2025

రాజమండ్రి: మార్చి 8 వరకు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందన్న PGRS సెషన్‌లు నిర్వహించమని కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా మండల కేంద్రల్లో ప్రజల నుంచి అర్జీలను అధికారులు స్వీకరించడం జరగదని, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీదారులు గమనించి అధికారులకు సహకరించాలన్నారు. ఎన్నికల అనంతరం యధవిధిగా కొనసాగుతుందన్నారు.

Similar News

News December 6, 2025

విమాన సర్వీసుల ఆలస్యంతో ప్రయాణికుల అవస్థలు

image

రాజమహేంద్రవరం (మధురపూడి) విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు కావడం, ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు ఇబ్బందులను చవి చూస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను, హైదరాబాద్ వెళ్లే రెండు సర్వీస్‌లను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బెంగళూరు వెళ్లాల్సిన విమానం 7.15 గంటలకు రావాల్సి ఉండగా శుక్రవారంరాత్రి 11 గంటలకు వస్తుందని ప్రకటించారు. ముంబై వెళ్లే విమానాలు సైతం బాగా ఆలస్యంగా నడిచాయి.

News December 6, 2025

నిఘాలో తూర్పు గోదావరి

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందేలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.

News December 6, 2025

పోలీసులు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు: ఎస్పీ

image

పోలీసు శాఖలో అవినీతి, అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ డి.నరసింహా కిషోర్ స్పష్టం చేశారు. సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే బాధ్యులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు.