News May 10, 2024
రాజమండ్రి: మురుగు కాలవలో శిశువు మృతదేహం

అభం శుభం తెలియని శిశువు మృతదేహం మురుగు కాలువలో లభ్యం కావడం స్థానికులను కలచి వేసింది. రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆర్యాపురం ప్రధాన మురుగు కాలువలో మగ శిశువు మృతదేహం కనిపించడంతో పోలీసులు బయటకు తీయించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా బొడ్డుతాడు కూడా తీయని శిశువు మృతదేహాన్ని కాలువలో పడేశారని, దీనిపై విచారణ చేపట్టామని ఎస్సై రామకృష్ణ తెలిపారు.
Similar News
News February 19, 2025
27న తూ.గో జిల్లాలో సెలవు

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.
News February 19, 2025
కొవ్వూరు : గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

కొవ్వూరు ఇంటిలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న డేవిడ్ రాజు మంగళవారం సాయంత్రం మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News February 19, 2025
రాజమండ్రి: జగన్ జైలుకు వెళ్లడం ఖాయం: గన్ని కృష్ణ

చేసిన తప్పుకు జైలు ఊచలు లెక్కపెడుతున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలోనే జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ జోస్యం చెప్పారు. భవిష్యత్‌లో తాను వెళ్ళబోతున్న జైల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోడానికి జగన్ వెళ్ళాడా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. నాడు చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టిన రోజులను మరిచిపోయినట్లుగా జగన్ నీతులు చెబితే ఎలా అని గన్ని ఎద్దేవా చేశారు.