News March 30, 2025

రాజమండ్రి: రహదారుల అభివృద్ధిపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే భేటీ

image

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు రూ.25 కోట్లతో అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు నిర్మించడానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఆయా గ్రామాల్లో అత్యవసరమైన పనుల ప్రతిపాదనల జాబితాను శనివారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జిల్లా కలెక్టర్ ప్రశాంతికి అందజేశారు. పంచాయతీరాజ్ పరిధిలో గల గ్రామీణ రోడ్లలో అధ్వానంగా ఉన్న వాటిని అభివృద్ధి చేయడానికి సహకరించాలని ఆయన కోరారు.

Similar News

News April 20, 2025

రేపు రాజమండ్రికి రానున్న మంత్రి నిమ్మల 

image

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 21న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్‌లతో ఉ.11.40 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మ.3 నుంచి సా.5 గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే డీఆర్‌సీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.

News April 20, 2025

రాజమండ్రి: పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో ఉద్రిక్తత

image

పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కొవ్వొత్తులతో నివాళులర్పిస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు హర్షకుమార్‌ను అదుపులోకి తీసుకుని జీపులో తీసుకెళ్లారు. క్రైస్తవులు, వివిధ సంఘాల నేతలు పాస్టర్ ప్రవీణ్‌కి నివాళులర్పించారు. పరిస్థితి ఉద్రిక్తత అవ్వడంతో నలుగురు నేతలను అదుపులోకి తీసుకుని రాజనగరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News April 20, 2025

రాజమండ్రి: మాజీ ఎంపీపై మూడో కేసు నమోదు

image

అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై రాజానగరం పోలీసులు శనివారం మరో కేసు నమోదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటన ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపు ఇవ్వడంపై అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అనుమతి తీసుకోకుండా ప్రవీణ్ మృతి చెందిన ఘటన స్థలం వద్ద ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది పాస్టర్ ప్రవీణ్ ఘటనకు సంబంధించి హర్ష కుమార్‌పై నమోదైన మూడో కేసుగా పోలీసులు తెలిపారు.

error: Content is protected !!