News March 22, 2024
రాజమండ్రి: ‘రాష్ట్రంలో టీడీపీ నేతలే గంజాయి డాన్లు’

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వ్యాపారానికి TDP నేతలే డాన్లనే విషయం విశాఖ పోర్టు ఘటన ద్వారా తేటతెల్లమైందని రాజమండ్రి సిటీ వైసీపీ MLA అభ్యర్థి భరత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కూనం కోటయ్య చౌదరి, వీరభద్రరావు కొకైన్ కేసులో కీలకమని తెలుస్తోందన్నారు. విశాఖపోర్టులో 25వేల కిలోల డ్రైఈస్ట్‌తో కలగలిపి కొకైన్‌ను అధికారులు గుర్తించారన్నారు. పట్టుబడిన వారు టీడీపీ నేత లోకేష్‌కు, బాలకృష్ణ వియ్యంకుడన్నారు.
Similar News
News November 27, 2025
జిల్లాలో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి: జేసీ

ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ అంచనాగా నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ వెల్లడించారు. గురువారం నాటికి మొత్తం 34,737 కొనుగోలు కూపన్లు రైతులకు జారీ చేశామని తెలిపారు. జిల్లాలోని 18 మండలాల్లో ఏర్పాటు చేసిన 201 కొనుగోలు కేంద్రాల ద్వారా, ఇప్పటివరకు 21,794 మంది రైతుల నుంచి 1,61,611.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 27, 2025
తూ.గో రైతులకు ముఖ్య గమనిక

ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాల పరిష్కారం కోసం స్థానిక బొమ్మూరు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని వెల్లడించారు. రైతులు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా 8309487151 నంబర్‌కు సంప్రదించి సహాయం పొందవచ్చని సూచించారు.
News November 27, 2025
రాజమండ్రి: సివిల్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్‌కు అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఏడీ బి. శశాంక తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 30లోగా రాజమండ్రిలోని స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. డిసెంబర్ 5న జరిగే స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి విజయవాడలో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.


