News November 10, 2024

రాజమండ్రి: రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కుడుపూడి సత్తిబాబు

image

ఏపీ శెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి రాజమండ్రికి చెందిన కుడుపూడి సత్తిబాబుకు దక్కింది. సత్తిబాబు టీడీపీ తెలుగు యువత, బీసీ సెల్ విభాగాలలో కీలకంగా పని చేశారు. టీడీపీ బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా, శ్రీశైలం గౌడ సత్రం డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తన తల్లి సరస్వతీ పేరిట సరస్వతమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.

Similar News

News November 25, 2025

తూ.గోలోకి కాదు.. కొత్త జిల్లానే!

image

వైసీపీ ప్రభుత్వంలో తూ.గో, కాకినాడ, కోనసీమ, అల్లూరి జిల్లాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు జిల్లా కేంద్రం పాడేరుకు దూరంగా ఉన్నాయి. దీంతో రంపచోడవరం తిరిగి తూ.గోలో కలిపితే జనాభా 10లక్షలు దాటుతుందని అంచనా. ఇదే జరిగితే మరోసారి తూ.గోజిల్లా పెదద్ది అవుతుంది. అలా కాకుండా చింతూరు, రంపచోడవరం డివిజన్లు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై నేడు సీఎం చర్చిస్తారని సమాచారం.

నిడదవోలు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

image

నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన నిడదవోలు మున్సిపాలిటీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గణపతి సెంటర్‌లో జరిగే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారని మంత్రి వెల్లడించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.