News February 4, 2025
రాజమండ్రి: ‘రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు’

రైల్వే బడ్జెట్లో ఏపీకి రికార్డు స్థాయిలో కేటాయింపులు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోమవారం పేర్కొన్నారు. ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కేటాయింపులు యూపీఏ కంటే 11 శాతం ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రంలో 73 స్టేషన్ల రూపురేఖలు మార్చేదిశగా ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే రూ.8,455 కోట్లు రైల్వే ప్రాజెక్టులు రావడం హర్షణీయమన్నారు.
Similar News
News September 15, 2025
తూ.గో పోలీస్ గ్రీవెన్స్కు 40 అర్జీలు

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”లో 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మురళీకృష్ణ అర్జీలు స్వీకరించారు. అక్కడికక్కడే సంబంధిత పొలీసు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానకి కృషి చేశారు. అర్జీలలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులు ఉన్నాయన్నారు.
News September 15, 2025
రాజమండ్రి: కలెక్టరేట్ PGRSలో 152 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వం వహించరాదని, నిర్ణీత సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి 152 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
News September 15, 2025
రాజమండ్రి: సెప్టెంబర్ 17 నుంచి ఉచిత వైద్య సేవలు

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ ప్రతులను రాజమండ్రిలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి ఆవిష్కరించారు. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే శిబిరాల ద్వారా మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.