News March 15, 2025
రాజమండ్రి: రైల్వే చీఫ్ క్రూ కంట్రోలర్గా శ్రీనివాసరావు

దక్షిణ మధ్య రైల్వే రాజమండ్రిలో చీఫ్ క్రూ కంట్రోలర్గా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇదే పదవిలో ఉన్న బీవీ బీకే రెడ్డి స్వచ్ఛందంగా రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారులు, క్రిందిస్థాయి ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని శ్రీనివాసరావు తెలిపారు.
Similar News
News January 6, 2026
రాజానగరం: తొలిసారిగా ‘నన్నయ వర్సిటీ’కి ఫైవ్ స్టార్ గౌరవం

ఉన్నత విద్యారంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ‘ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్’ సర్టిఫికెట్ లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా నన్నయ వర్సిటీ ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం విశేషం. మంగళవారం అమరావతిలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఈ సర్టిఫికెట్ను వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు.
News January 6, 2026
సంక్షేమమే లక్ష్యం.. అబ్కారీ శాఖపై మంత్రి కొల్లు సమీక్ష

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వేదికగా మంగళవారం అబ్కారీ, మధ్యపాన నిషేధ శాఖపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, సమాజ సంక్షేమమే ధ్యేయంగా అబ్కారీ శాఖ పనిచేయాలని ఆదేశించారు. శాఖాపరమైన పనితీరులో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.
News January 6, 2026
10న రాజమండ్రిలో జాబ్ మేళా..!

నిరుద్యోగ రహిత రాజమండ్రిని నిర్మించడమే లక్ష్యంగా ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి మాజీ MP మార్గాని భరత్ సోషల్ మీడియా వేదికగా మంగళవారం వెల్లడించారు. ఆరోజు ఉదయం 9గం. నుంచి మంజీరా కన్వెన్షన్ సెంటర్ వద్ద జాబ్ మేళా జరుగుతుందన్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బి.ఫార్మసీ, MBA చదివిన వారు అర్హులన్నారు.


