News October 24, 2024

రాజమండ్రి: రైళ్లు రద్దు.. హెల్ప్ డెస్క్ నంబర్లివే.!

image

దానా తుఫాను నేపథ్యంలో తూ.గో. జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. 30రైళ్లకు పైగా రద్దు కాగా, ఈ నెల 25వరకు వాటిని పునరుద్ధరించే అవకాశం లేనట్లు కన్పిస్తోంది. దీంతో సికింద్రాబాద్, వైజాగ్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలు స్టేషన్లలో అధికారులు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు.* రాజమండ్రి: 0883- 2420541* నిడదవోలు: 08813- 223325* సామర్లకోట: 088-42327010

Similar News

News November 17, 2025

ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో జమ: జేసీ

image

ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో మద్దతు ధర నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,240 మంది రైతులకు రూ.55.82 కోట్లు జమ చేసినట్లు సోమవారం రాజమండ్రిలో ఆయన వివరించారు. రైతులకు ఏ సమస్య ఎదురైనా వెంటనే 8309487151 నంబర్‌కు కాల్ చేసి తమ సందేహాలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చని సూచించారు.

రాజమండ్రి: శబరిమలైకు ప్రత్యేక బస్సులు

image

శబరిమల భక్తుల నుంచి ఆర్టీసీ బస్సులకు అమితమైన ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా రాజమండ్రి డిపో నుంచి సోమవారం ఐదు సూపర్ లగ్జరీ బస్సులు శబరిమల యాత్రకు బయలుదేరాయి. ఈ బస్సులు యాత్ర ముగించుకుని ఈ నెల 23న తిరిగి డిపోకు చేరుకుంటాయి. భక్తుల ఆదరణకు డిపో మేనేజర్ మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు కోరితే వారి గ్రామాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.