News October 5, 2024

రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ యువతి మృతి

image

నిడదవోలుకు చెందిన దీప్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పోలీసుల కథనం..సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. ఫ్రెండ్స్‌తో రాజమండ్రి చూసి వస్తానని శుక్రవారం ఇంట్లో చెప్పి వచ్చింది. 9 మంది 4 బైకులపై బయలుదేరారు. కోరుకొండ నారసింహున్ని దర్శించుకుని వస్తూ.. బూరుగుపూడి జంక్షన్ వద్ద బైకు నడుపుతున్న దీప్తి, టాటా ఏసీని ఢీకొట్టి ప్రాణాలు విడిచింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 11, 2024

నారా లోకేశ్ చొరవతో రాజమండ్రికి చేరిన బాధితురాలు

image

రాజమండ్రికి చెందిన శిరీష అనే మహిళ జీవనోపాధి కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లి ఇబ్బంది పడుతుందని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబసభ్యులు మంత్రి లోకేశ్‌కు ఎక్స్ వేదికగా విన్నవించారు. దీంతో స్పందించిన లోకేశ్ తనని తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఆదివారం స్వస్థలానికి తీసుకొచ్చినట్లు మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో బాధితురాలు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

News November 11, 2024

మాజీ MLA వర్మకు కీలక పదవి?

image

టీడీపీ ప్రభుత్వం 2 సార్లు నామినేటెడ్ పోస్టులను విడుదల చేసింది. అయితే కూటమి ప్రభుత్వం కలయికతో మాజీ MLA వర్మకు దక్కుతుందని ఆశించిన పిఠాపురం సీటును జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా టీడీపీ విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల్లో కూడా వర్మకు చోటివ్వలేదు. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం చంద్రబాబుతో వర్మ భేటీ కానున్నారని MLC కేటాయించే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

News November 11, 2024

ఇసుకను నిర్ణయించిన ధరకే విక్రయించాలి: మంత్రి దుర్గేశ్

image

సామాన్య ప్రజలు, భవన నిర్మాణ కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి దుర్గేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే కొంతమంది ఇసుకను ఉచితంగా కాకుండా లాభాపేక్షతో ఎక్కువ ధరకు విక్రయించడం జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రభుత్వం ఇసుకకు నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.