News April 5, 2025

రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో ఆర్ట్స్ కాలేజీ విద్యార్ధి మృతి

image

గండేపల్లి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్ధి బాడవుల కేదార్ మణికంఠ (21) చికిత్స పొందుతూ మృతి చెందాడు. గండేపల్లి ఎస్సై శివ నాగబాబు వివరాల ప్రకారం..ఏలూరు ముదినేపల్లికి చెందిన మణికంఠ, రాజమండ్రికి చెందిన విష్ణువర్ధన్‌తో కలిసి ధర్మవరంలో బిర్యానీ తినేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గండేపల్లి శివారులో ఎదురుగా బైకు ఢీకొట్టిన ఘటనలో చనిపోయాడన్నారు.

Similar News

News April 8, 2025

తూ.గో: వీడు మామూలోడు కాదు..!

image

బిక్కవోలు జగనన్న కాలనీలో నిన్న ఓ యువకుడు గంజాయితో పట్టుబడిన విషయం తెలిసిందే. నర్సీపట్నానికి చెందిన సూర్యప్రకాశ్ 10వ తరగతి వరకు చదివాడు. కాకినాడ జిల్లా ఉప్పాడలోని ఓ చికెన్ సెంటర్‌లో పనిచేస్తూ బైక్‌లు దొంగలిస్తున్నాడు. మరోవైపు గంజాయి వ్యాపారానికి తెరలేపాడు. దొంగతనం చేసిన బైకును కె.పెదబయలుకు చెందిన పంతులబాబు అనే వ్యక్తికి ఇచ్చి గంజాయి తీసుకుని బిక్కవోలుకు రాగా పోలీసులకు దొరికాడు.

News April 8, 2025

రాజమండ్రి: ‘ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి’

image

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డీఎంహెచ్‌ఓ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక ఎస్.టి హాస్టల్‌లో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీ లక్ష్మి పాల్గొని మాట్లాడారు. అందరూ ఆహార, శుభ్రత నియమాలు పాటించాలని సూచించారు.

News April 7, 2025

రాజమండ్రి: 211 మంది ఉద్యోగులకు పదోన్నతులు

image

పంచాయతీలకు కార్యదర్శుల లేమి తీరనుంది. గ్రేడ్-5 స్థాయిలోని సచివాలయ ఉద్యోగులకు గ్రేడ్-4 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి తూ.గో జిల్లాలో 211 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించింది. వారిలో చాలామందిని ఏజెన్సీ గ్రామాలకు, మరి కొంతమందిని తూ.గో, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పంచాయతీ సెక్రటరీలుగా నియమించారు. సోమవారం వీరంతా కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.

error: Content is protected !!