News July 31, 2024

రాజమండ్రి వాసిని అభినందించిన డిప్యూటీ సీఎం

image

అంతర్జాతీయ టైగర్స్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పులుల ఫొటోలతో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌‌కు ముఖ్య అతిథిగా మంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ద్రోణంరాజు భగవాన్ దాస్ తీసిన పులుల ఫొటోలను పవన్ చూశారు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయని పవన్ దాస్‌ను అభినందించారు.

Similar News

News December 10, 2025

రాజమండ్రిలో ఈనెల 12న జామ్ మేళా!

image

రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని ఆమె సూచించారు.

News December 10, 2025

రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఉనగట్ల విద్యార్థులు ఎంపిక

image

చాగల్లు మండలం ఉనగట్ల జడ్పీ హైస్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల చిట్యాలలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14 విభాగంలో ఈ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారని హెచ్‌ఎం ఎన్.వీ. రమణ తెలిపారు. పంతగాని లాస్య, కంచర్ల హనీ చక్కటి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.

News December 10, 2025

తూ.గో: గ్రామీణ రహదారుల మరమ్మతులకు భారీగా నిధులు

image

గ్రామీణ రహదారుల మరమ్మతులు, నిర్మాణాల కోసం ఏపీఆర్‌ఎస్‌పీ పథకం కింద ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఏకంగా రూ.363.33 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 57 పనులకు రూ.72.39 కోట్లు, కోనసీమ జిల్లాలో 78 పనులకు రూ.130.79 కోట్లు, కాకినాడ జిల్లాలో 106 పనులకు రూ.160.15 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు.