News November 10, 2024
రాజమండ్రి: విధేయతకు దక్కిన గౌరవం ‘రుడా ఛైర్మన్’

TDP రాష్ట్ర కార్యదర్శి, రాజానగరం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకట రమణ చౌదరి గత ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. మొదటి నుంచి పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేశారు. కానీ NDA కూటమి పొత్తులో భాగంగా ఎమ్మెల్యే సీటును జనసేనకు కేటాయించారు. రాజమహేంద్రవరం ఏంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అది కూడా బీజేపీ పోయింది. ప్రస్తుతం ఆయనకు రుడా ఛైర్మన్గా అవకాశం కల్పించింది.
Similar News
News October 14, 2025
దీపావళి నేపథ్యంలో భద్రతా చర్యలు తప్పనిసరి: కలెక్టర్

దీపావళి పండుగ సందర్భంగా అనుమతులు, భద్రతా చర్యల విషయంలో సంబంధిత అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. టపాసుల హోల్సేల్ స్టాక్ షెడ్లు, తాత్కాలిక దుకాణాలకు వచ్చే దరఖాస్తులను రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖల త్రిసభ్య కమిటీ ద్వారా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.
News October 13, 2025
రాజమండ్రిలో యువ హీరో సందడి

అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా ‘కె – ర్యాంప్’ రూపొందిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. సినిమా ప్రమోషన్ నిమిత్తం ఆయన సోమవారం రాజమండ్రి వచ్చారు. జైన్స్ నాని దర్శకత్వంలో, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదల కానుందని చెప్పారు. సినిమా ఆద్యంతం వేగంగా, స్పీడుగా నడుస్తుందనే ఉద్దేశంతోనే ‘ర్యాంప్’ అనే పేరు పెట్టామని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.
News October 13, 2025
జీఎస్టీ 2.0 తో ప్రజలకు ఊరట: కలెక్టర్

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు కలెక్టర్ కీర్తి చేకూరి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. జీఎస్టీ 2.0 అమలుతో ప్రజలకు ఊరట లభిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తెచ్చిందని వివరించారు.