News August 6, 2024
’రాజమండ్రి విమానాశ్రయం లీజుకు’
దేశవ్యాప్తంగా 2022- 2025 మధ్యకాలంలో లీజుకు ఇవ్వాలని గుర్తించిన విమానాశ్రయాల్లో రాజమండ్రి విమానాశ్రయం ఒకటని కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు. ఉత్తమ యాజమాన్య విధానాలు, ప్రైవేటు రంగానికి ఉన్న సామర్థ్యాలు, పెట్టుబడి శక్తిని ఉపయోగించుకునేందుకే ఈ విమానాశ్రయాలను లీజుకు ఇస్తున్నట్లు చెప్పారు. లీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర విమానాశ్రయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు.
Similar News
News September 15, 2024
తలుపులమ్మ సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి దంపతులు
తుని మండలంలోని లోవలో ఉన్న తలుపులమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి దేవస్థానం ఈఓపి విశ్వనాథరాజు, వేద పండితులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, వస్త్రాలు వారికి అందజేశారు.
News September 14, 2024
రాజానగరంలో తీవ్ర విషాదం
రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. టీ పొడి అనుకుని పొరపాటున వృద్ధ దంపతులు పురుగు మందు వేసుకొని టీ తాగారు. ఈ ప్రమాదంలో వెలుచూరి గోవింద్(75), అప్పాయమ్మ (70) మృతి చెందారు. అప్పాయమ్మకు కంటి చూపు తక్కువగా ఉండడంతో పొలాలకు చల్లే గుళికల ప్యాకెట్‌ను టీ ప్యాకెట్‌గా భావించి టీ పెట్టుకొని తాగారు. కొద్దిసేపటికే నోటి నుంచి నురగలు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
News September 14, 2024
కాకినాడ: యాంకర్ శ్యామలకు వైసీపీలో కీలకపదవి
వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రముఖ యాంకర్ శ్యామల నియమితులయ్యారు. కాకినాడలోని ఇంద్రపాలేనికి చెందిన శ్యామల సీరియల్ నటిగా, యాంకర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు సినిమాల్లోనూ నటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో వైసీపీ తరఫున విస్తృత ప్రచారం చేశారు.