News March 27, 2025
రాజమండ్రి : వెంటిలేటర్పై అంజలి

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన అంజలి వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతోంది. దీనికి ఏజీఎం దీపక్నే కారణమని విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబీకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగులేదని వైద్యులు తెలిపారు. కాగా ఆమె తల్లిదండ్రులు తమ కూతురు బతికి వస్తుందని, రావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు
Similar News
News December 9, 2025
చివ్వెంలలో తెల్లవారుజామున భారీ పేలుడు

చివ్వెంల మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. బ్రిక్స్ యూనిట్లోని పీడన ఫోమ్ తయారీ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగిందని స్థానికులు తెలిపారు. పేలుడు శబ్దం భారీగా ఉండడంతో సమీపంలోని బీబీగూడెం, మున్యా నాయక్ తండా ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు తండోపతండాలుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News December 9, 2025
అల్లూరి జిల్లాలో రోడ్డెక్కనున్న నైట్ హల్ట్ బస్సులు

మావోయిస్టులు ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు PLGA వారోత్సవాలు ప్రకటించడంతో గిరిజన ప్రాంతానికి వచ్చే నైట్ హల్ట్ బస్సులు సోమవారం వరకు పలు ప్రాంతాలకు నిలిపివేయడం, కొన్ని బస్సులు పోలీసు స్టేషన్ సమీపంలో ఉంచడం జరిగేది. నిన్నటితో వారోత్సవాలు ముగిసాయి. నేటి నుంచి నైట్ హల్ట్ బస్సు సర్వీసులు వై.రామవరం, రాజవొమ్మంగి, రెవళ్లు యధావిధిగా నడుస్తాయని ఏలేశ్వరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు.
News December 9, 2025
ఫ్రాడ్ కాల్స్ వేధిస్తున్నాయా?

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్, మెసేజ్లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<


