News March 27, 2025

రాజమండ్రి : వెంటిలేటర్‌పై అంజలి

image

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన <<15888553>>అంజలి వెంటిలేటర్<<>> పైనే చికిత్స పొందుతోంది. దీనికి ఏజీఎం దీపక్‌నే కారణమని విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబీకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగులేదని వైద్యులు తెలిపారు. కాగా ఆమె తల్లిదండ్రులు తమ కూతురు బతికి వస్తుందని, రావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు

Similar News

News November 14, 2025

మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం: ఎస్పీ జానకి

image

నిర్మల్ జిల్లాలో మహిళల భద్రతకు ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మహిళా రక్షణ కోసం షీ టీం బృందం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. మహిళలపై వేధింపులు, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఆకతాయిలను ఎక్కడైనా గమనించినా వెంటనే డయల్ 100కు లేదా షీ టీం పోలీసులకు 8712659550 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.

News November 14, 2025

రేపటి తెలంగాణ భవిష్యత్తు నేటి బాలలదే: కలెక్టర్

image

రేపటి తెలంగాణ భవిష్యత్తు నేటి బాలలపై ఆధారపడి ఉందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన బాలల దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ‘2047 రైసింగ్ తెలంగాణ’ విజన్​లో పిల్లల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. 0-18 ఏళ్ల వయసు ఉన్న వారందరూ పిల్లలుగా పరిగణించబడతారని, పిల్లల రాజ్యాంగం వారికి చట్టపరమైన హక్కులను కల్పించిందని, బాలలు ఈ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

News November 14, 2025

HYD: 3ఏళ్లకే రికార్డులు కొల్లగొడుతున్న కార్తీక్ సూర్య

image

వనస్థలిపురంలోని IT ఉద్యోగి ప్రశాంత్, నీరజ కొడుకు కార్తీక్ సూర్య(3)కు 16 నెలల వరకు మాటే రాలే. 3 ఏళ్ల వయసులో అంకెలు గుర్తించి తల్లిని అడిగి తెలుసుకునేవాడు. వారి పెంపకంలో రోజుల వ్యవధిలోనే పెద్ద అంకెలతో కూడిక, తీసివేత, శాతాలు చేయడం మొదలెట్టాడు. కఠిన పదాలకు క్షణాల్లో నోటితోనే కచ్చితమైన సమాధానం చెప్తాడు. ఇండియా, నోబుల్, కిడ్స్, తెలంగాణ, తెలుగు, వరల్డ్ వైడ్, కలాం వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నాడు.