News February 12, 2026

రాజమండ్రి వ్యక్తి హత్య?.. సహజీవనం చేస్తున్న మహిళే చంపిందా?

image

రాజమండ్రికి చెందిన నాగశివ(38) విశాఖ జిల్లా ఆనందపురం శివారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన <<19110749>>సంగతి తెలిసిందే<<>>. మృతుడి ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. నాగశివతో సహజీవనం చేస్తున్న శ్రావణి, మద్యం మత్తులో జరిగిన గొడవ కారణంగానే అతనిపై దాడి చేసి చంపి ఉండవచ్చని సమాచారం. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Similar News

News March 13, 2026

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

ప్రముఖులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ విక్రాంత్ హెచ్చరించారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో తప్పుడు వార్తలు, ద్వేషపూరిత పోస్టులు చేస్తే గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.

News March 13, 2026

నేనూ రైతు బిడ్డనే: చంద్రబాబు

image

AP: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ జరిగిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చే ₹6 వేలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం ₹14 వేలు కలిపి ఏటా ప్రతి రైతు ఖాతాలో ₹20 వేలు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. తాను కూడా రైతు బిడ్డనేనని.. వారి కష్టాలు తనకు తెలుసని, అందుకే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

News March 13, 2026

NRPT: ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన ట్రైనీ కలెక్టర్

image

నారాయణపేట ఆర్డీవోగా శుక్రవారం ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అయిదు వారాల పాటు ఆర్డీవోగా విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డివిజన్ ప్రాంతంలో మౌలికవసతుల పర్యవేక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు జరిగేలా చూస్తానని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవోకు తహశీల్దార్‌లు శుభాకాంక్షలు చెప్పారు.