News February 6, 2025
రాజమండ్రి: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

రాజమండ్రిలోని బొమ్మూరులో ఓ ఇంట్లో వ్యవభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో బుధవారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. వడ్డివీరభద్రనగర్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇంటిపై ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ సిబ్బందితో కలిసి దాడిచేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న వెంకటలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణతో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశామన్నారు. ఒక బాధిత మహిళను విడిపించామన్నారు.
దీనిపై కేసు నమోదైంది.
Similar News
News September 18, 2025
ఈసీఐఎల్లో 160 ఉద్యోగాలు

హైదరాబాద్లోని <
News September 18, 2025
గుంతకల్లుకు నటి నిధి అగర్వాల్

ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఈ నెల 22న గుంతకల్లుకు రానున్నారు. ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి ఆమె రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’లో నటించిన ఆమె ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు.
News September 18, 2025
ASF: ‘అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి’

జిల్లాలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్, ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు ఛైర్మన్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ASF కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు సమావేశానికి హాజరయ్యారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని, సీసీఈ నివేదికలు నిర్వహించాలని తెలిపారు.