News August 19, 2024
రాజమండ్రి: సముద్రంలోకి 2.47 లక్షల క్యూసెక్కుల నీరు
రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం 2.47 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 13,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజీ వద్ద 9.90 అడుగుల నీటిమట్టం కొనసాగుతుందని వివరించారు.
Similar News
News September 8, 2024
కాకినాడ జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు
కాకినాడ జిల్లాలో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ఒక్క పాఠశాల నిర్వహించకూడదని, విధిగా సెలవు అమలు చేయాలన్నారు.
News September 8, 2024
కాకినాడ: మద్యం తాగుతూ గొడవ.. వ్యక్తి హత్య
కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తుమ్మలపల్లి లక్ష్మణ్‌రావు(58), రాంబాబు ఇద్దరు కలిసి మద్యం తాగుతుండగా వాగ్వాదం జరిగింది. కోపంలో రాంబాబు చాక్‌తో లక్ష్మణ్‌రావు గొంతు కోశాడు. గాయపడిన లక్ష్మణ్ రావును కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. దారిలోనే మృతి చెందాడు. దీనిపై కరప పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 8, 2024
కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కాకినాడ జిల్లా వాసి
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావు పేటకు చెందిన నక్క సత్యనారాయణ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1983 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్‌లో ఉండి సామాన్య కార్యకర్తగా సేవలు అందించానన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.