News September 3, 2024
రాజమండ్రి: సముద్రంలోకి 3.40 లక్షల క్యూసెక్కుల జలాలు
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం 3.40 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 8.60 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని చెప్పారు.
Similar News
News September 17, 2024
నేడు రాజమహేంద్రవరంలో స్వచ్ఛతా హీ సేవ, విశ్వకర్మ జయంతి వేడుకలు
రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని, విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆమె సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 9:30 నుంచి రాజమహేంద్రవరంలోని వై జంక్షన్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద విశ్వకర్మ జయంతి వేడుకలు జరుపుతామన్నారు.
News September 16, 2024
కాకినాడ: అనుమానంతో భార్యను కడతేర్చాడు
విశాఖపట్నం నక్కవానిపాలెంలో కాకినాడకు చెందిన సలోమి (28)ని భర్త డానియల్ అనుమానంతో హతమార్చాడని విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ మురళి ఆదివారం తెలిపారు. ఇంట్లో భార్యను గొంతు నలిమి హత్య చేసి, కొడుకుని తీసుకొని కాకినాడ వెళ్లి పోలీసులకు లొంగిపోయాడని తెలిపారు. సలోమి హోటల్లో సూపర్వైజర్‌గా పని చేస్తందని, డానియల్ చర్చిలో వీడియో గ్రాఫర్‌గా పనిచేస్తారన్నారు. సలోమి తల్లి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు.
News September 16, 2024
తూ.గో: పెద్దాపురంలో వికసించిన బ్రహ్మ కమలం
హిమాలయ పర్వత శ్రేణుల్లో పెరిగే బ్రహ్మ కమలం పెద్దాపురంలో కొత్తపేట రామాలయం వీధికి చెందిన ఆదిరెడ్డి విజయలక్ష్మి ఇంటి పెరటిలో ఆదివారం వికసించింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూసే బ్రహ్మ కమలం మొక్కను ఆమె తులసి కోటలో నాటగా బ్రహ్మ కమలం వికసించటంతో ఆదివారం ఈ కమలాన్ని చూడడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు తరలి వచ్చారు.