News May 21, 2024
రాజమండ్రి సెంట్రల్ జైలుకు అవార్డు

జీవ వైవిధ్య, పర్యావరణ విలువలు పాటిస్తున్న రాజమండ్రి సెంట్రల్ జైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు తరఫున ‘బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అవార్డు’కు ఎంపికైనట్లు జైలు పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల 22న జరిగే అంతర్జాతీయ జీవవైవిధ్య పరిరక్షణ దినోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డు అందుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 13, 2025
జీఎస్టీ 2.0 తో ప్రజలకు ఊరట: కలెక్టర్

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు కలెక్టర్ కీర్తి చేకూరి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. జీఎస్టీ 2.0 అమలుతో ప్రజలకు ఊరట లభిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తెచ్చిందని వివరించారు.
News October 13, 2025
ఇండియన్ రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం వాయిదా

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తూ.గో. జిల్లా శాఖ నూతన మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు విషయమై ఈ నెల 15న ఉదయం 11 గంటలకు జరగవలసిన సమావేశం వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం తెలిపారు. ఉమ్మడి తూ.గో. జిల్లా కాకినాడ నుంచి జాబితా ఇంకా అందకపోవడమే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. తదుపరి సమావేశపు తేదీని త్వరలో ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
News October 13, 2025
గోకవరం ఆర్ & ఆర్ కాలనీ రోడ్లో DEAD BODY

గోకవరం ఆర్ & ఆర్ కాలనీ రోడ్డుపై మృతదేహం కలకలం రేపింది. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు గోకవరం PSకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.