News May 21, 2024

రాజమండ్రి సెంట్రల్ జైలుకు అవార్డు

image

జీవ వైవిధ్య, పర్యావరణ విలువలు పాటిస్తున్న రాజమండ్రి సెంట్రల్ జైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు తరఫున ‘బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అవార్డు’కు ఎంపికైనట్లు జైలు పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల 22న జరిగే అంతర్జాతీయ జీవవైవిధ్య పరిరక్షణ దినోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డు అందుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 11, 2024

సుకుమార్: మట్టపర్రు To పాన్ ఇండియా

image

పుష్ప పార్ట్-1, 2లతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్‌ది మన జిల్లానే. ఆయన ఉమ్మడి తూ.గో.జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు గ్రామంలో 1970లో జన్మించారు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి కనబరిచే వారు. ఉన్నత చదువులు చదివిన ఆయన మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేశారు. 2004లో ఆర్య మూవీతో డైరెక్టర్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి హిట్‌లు అందుకున్నారు. ఇప్పటివరకు ఆయన 8 సినిమాలకు దర్శకత్వం వహించారు.

News December 11, 2024

ప్రత్తిపాడు: పులి ఆచూకీ కోసం గాలింపు

image

ప్రత్తిపాడు మండలం బురదకోట అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఆచూకీ కోసం ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మరంగా గాలించారు. ఎంత వెతికినా పులి జాడ మాత్రం కనిపించలేదు. దాని కోసం 6 ట్రాప్ కెమెరాలను బురదకోట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అనంతరం పులి ఆచూకీ తెలుసుకునేందుకు చేపట్టాల్సిన అంశాలపై రేంజర్ సమావేశం నిర్వహించి సిబ్బందికి సూచనలిచ్చారు.

News December 11, 2024

తూ.గో: అలా జరిగి ఉంటే వారు బతికి ఉండేవాళ్లు

image

మరో 5 కిలో మీటర్లు ప్రయాణించి ఉంటే ఇంటికి చేరుకునే వారు. అంతలో వారిని మృత్యువు కబళించింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో పోతవరానికి చెందిన విజయ్ కుమార్ భార్య, కుమారుడు మృతి చెందగా.. మరొక కుమారుడు గల్లంతయ్యారు. దీంతో విజయ్ కుమార్ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భార్యాపిల్లలను కోల్పోయానని అతడు మృతదేహాల వద్ద రోధించిన తీరు అందరినీ కలచివేసింది.