News December 30, 2024
రాజమండ్రి: స్పా సెంటర్‌లో వ్యభిచారం
రాజమండ్రి జేఎన్ రోడ్‌లో హ్యాపీ స్ట్రీట్ దగ్గర్లో గల ఓ స్పా సెంటర్‌లో ఆదివారం రాత్రి ప్రకాష్ నగర్ పోలీసు స్టేషన్ సీఐ బాజీలాల్ తనిఖీ చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించారు. స్పా నిర్వాహకులు, ఇద్దరు విటులను ఆరుగురు బాధిత యువతులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించినట్లు సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
Similar News
News January 19, 2025
కూనవరం: ఆదివాసీల సామూహిక చేపల వేట
కూనవరం మండలం చిన్నారుకుర్ పెద్ద చెరువులో ఆదివారం ఆదివాసీలు సామూహిక చేపల వేట నిర్వహించారు. సంక్రాంతి తర్వాత సంప్రదాయంగా చేపల వేట చేస్తామన్నారు. నాలుగు మండలాల నుంచి 3000 మంది చిన్నా ,పెద్దా తేడా లేకుండా ఆదివాసీ పెద్దల సమక్షంలో చేపల వేట సాగించారు. గ్రామ పెద్దలు బంధువులు అందరికీ కబురు పెట్టి వారి సమక్షంలో వయసుతో నిమిత్తం లేకుండా ఈ వేట సాగిస్తారన్నారు.
News January 19, 2025
పిఠాపురంలో ఆర్మీ జవాన్ ఆత్మహత్య
పిఠాపురంలో అనకాపల్లి జిల్లా మాకవరపాలేనికి చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు బూరుగుపాలెంకు చెందిన గూనూరు భరత్(22)గా గుర్తించారు. ఏడాది క్రితం అగ్నివీర్ ఎంపికలో ఉద్యోగం పొందిన భరత్ శిక్షణ ముగించుకుని వెస్ట్ బెంగాల్‌లో ఉద్యోగం చేశాడు. ప్రేమించిన యువతి దూరమవుతుందని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని శనివారం రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు.
News January 19, 2025
తూ.గో: 20వ తేదీన యథావిధిగా పీజిఆర్ఎస్
ఈనెల 20వ తేదీన సోమవారం రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలందరూ గమనించాలని సూచించారు.