News April 13, 2025

రాజమండ్రి: స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను అభినందించిన డీఐజీ

image

ప్రవీణ్ కుమార్ పగడాల కేసు ఛేదించేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించడంలో ఎంతో ప్రతిభ చాటిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని DIG అశోక్ కుమార్ అభినందించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం అనంతరం SIT టీంను డీఐజీ, ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా సన్మానించారు. సుమారు 400కుపైగా సీసీ కెమెరాలను పరిశీలించి కేసును కొలిక్కి తేవడంలో SIT అద్భుత ప్రతిభ చాటిందని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు.

Similar News

News April 11, 2026

గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

image

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం.

News April 11, 2026

ఖమ్మం: జాగ్రత్త.. వడదెబ్బకు ఇద్దరి మృతి..!

image

ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత ఇద్దరిని బలితీసుకుంది. కూసుమంచి(M) గట్టుసింగారానికి చెందిన రైతు భారీ చౌడయ్య(50) గురువారం పొలంలో పని చేస్తుండగా వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచారు. అలాగే, తల్లాడ(M) రామచంద్రపురంలో శుక్రవారం కూలీ పనులకు వెళ్లిన పులి సత్యనారాయణ ఎండ తీవ్రతకు కుప్పకూలి మృతి చెందారు. వీరి మరణాలతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎండకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News April 11, 2026

అన్నింటా ఉన్నవాడే ‘వేంకటేశ్వరుడు’

image

సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః|
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః||
దేవతలకు అధిపతి, మనందరికీ శరణమిచ్చేవాడు, సహనశీలుడు, విశ్వానికి బీజము, జీవుల సృష్టికి కారణము వేంకటేశ్వరుడే. దినం, సంవత్సరం, సర్పం కూడా ఆయనే. విశ్వాసానికి మూలంగా, సమస్తాన్ని చూడగలిగే సర్వదర్శనుడిగా ఆయన సృష్టి, కాలం, రక్షణ, జ్ఞాన రూపాలలో అన్నింటా ఉంటాడు. అయన దర్శనం ముక్తికి మార్గం.