News April 24, 2025

రాజమండ్రి: హత్యచేసిన వారిపై చర్యలు కోరుతూ ఆందోళన

image

వివాహితను ప్రేమ పేరుతో మోసం చేసి హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలంటూ బాధిత మహిళ కుటుంబంతో కలిసి, ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బుధవారం రాత్రి రాజమండ్రి బైపాస్ రోడ్ చర్చి సెంటర్లో ఎమ్మార్పీఎస్ ఈ ఆందోళన చేపట్టారు. ఆంధ్రనగర్‌ 1వ వీధిలో నివసిస్తున్న పలివెల మార్త (23)ని ప్రేమపేరుతో ఒక వ్యక్తి మోసగించి చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసి 20 రోజులైనా న్యాయం జరగలేదన్నారు.

Similar News

News April 24, 2025

నిడదవోలు: చూపరులను కంటతడి పెట్టిస్తున్న ఫ్లెక్సీ

image

నిడదవోలుకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎం.ప్రకాష్ కుమార్ ఇటీవల కొవ్వూరు మండలం చిగురులంక వద్ద గోదావరిలో గల్లంతై ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ప్రకాష్ కుమార్ ఆదరణ కూడిక సందర్భంగా అతని ఫ్రెండ్స్ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ చూపరులను కంటతడి పెట్టిస్తుంది. నిన్న విడుదలైన పది ఫలితాలలో 533 మార్కులు సాధించాడు. మిత్రులందరూ చంటి‌నీ మార్కుల జాబితా అంటూ మార్కుల షీట్‌ను ఫ్లెక్సీ వేయించారు.

News April 24, 2025

తండ్రిని చంపించింది రాజమండ్రిలో ఉంటున్న కొడుకే

image

అనకాపల్లి (D) చినకలువలాపల్లిలో జరిగిన వడ్డీ వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జల్లి తాతారావును కొడుకు అప్పలరెడ్డే హత్య చేయించాడని, తండ్రి తన ఆస్తిని సవతి తల్లి కుమార్తెకు ఇచ్చేస్తాడని భావించి ఇద్దరిని పురమాయించి హత్య చేయించినట్లు వెల్లడించారు. రాజమండ్రిలో ఉంటున్న అప్పలరెడ్డితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

News April 24, 2025

కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు ముమ్మరం!

image

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు SP బిందుమాధవ్ ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ మణీష్ దేవరాజ్ కేసు విచారణకు అనుమతి ఇవ్వాలంటూ రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రభుత్వం ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమించింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ MLC అనంతబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

error: Content is protected !!