News April 7, 2025

రాజమండ్రి: 211 మంది ఉద్యోగులకు పదోన్నతులు

image

పంచాయతీలకు కార్యదర్శుల లేమి తీరనుంది. గ్రేడ్-5 స్థాయిలోని సచివాలయ ఉద్యోగులకు గ్రేడ్-4 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి తూ.గో జిల్లాలో 211 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించింది. వారిలో చాలామందిని ఏజెన్సీ గ్రామాలకు, మరి కొంతమందిని తూ.గో, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పంచాయతీ సెక్రటరీలుగా నియమించారు. సోమవారం వీరంతా కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.

Similar News

News April 17, 2025

రాజమండ్రి: గోదావరిలో పడి మహిళ మృతి

image

రాజమండ్రిలోని మార్కండేశ్వర స్వామి గుడి సమీపంలో గోదావరిలో మునిగి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విజయనగరానికి చెందిన నారాయణమ్మ రాజమండ్రిలోని ఓంశాంతి ఆశ్రమానికి వచ్చి వెళుతుంటుంది. ఈ విధంగా అక్కడికి వచ్చి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి చనిపోయి ఉంటుందన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

News April 16, 2025

వైజాగ్‌లో ముక్కామలకు చెందిన యువకుడి మృతి

image

వైజాగ్‌లోని దివీస్‌లో పనిచేస్తున్న పెరవలి మండలం ముక్కామలకు చెందిన మధు మోహన్ మంగళవారం మృతి చెందాడు. మోహన్ దివీస్‌లో పనిచేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కి వచ్చాడు. అనంతరం ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భీమిలి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

News April 16, 2025

రాజమండ్రి: నేటి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు

image

నేటి నుంచి జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ వేసవిలో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. బుధవారం నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ జూన్ 11 నుంచి జూలై 12వరకు ముహూర్తాలు లేవు. జూలై 25 నుంచి శ్రావణమాసంలో శుభ ఘడియలు ఉండటంతో ముహూర్తాలు ఉండనున్నాయి. ఇక ఏప్రిల్, మే, జూన్ నెలల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో తెలుగింట వివాహ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.

error: Content is protected !!