News April 7, 2025
రాజమండ్రి: 211 మంది ఉద్యోగులకు పదోన్నతులు

పంచాయతీలకు కార్యదర్శుల లేమి తీరనుంది. గ్రేడ్-5 స్థాయిలోని సచివాలయ ఉద్యోగులకు గ్రేడ్-4 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి తూ.గో జిల్లాలో 211 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించింది. వారిలో చాలామందిని ఏజెన్సీ గ్రామాలకు, మరి కొంతమందిని తూ.గో, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పంచాయతీ సెక్రటరీలుగా నియమించారు. సోమవారం వీరంతా కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.
Similar News
News April 25, 2025
సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెబుతా : మాజీ ఎంపీ హర్ష కుమార్

తనను పోలీసులు అదుపులోకి తీసుకొని కొన్ని గంటలు నగరంలో తిప్పడంతో కోపం, బాధతో సీఎం చంద్రబాబును ఏకవచనంతో తూలనాడానని, ఇది తప్పేనని, అవసరమైతే ఆయనకు క్షమాపణ చెబుతానని మాజీ ఎంపీ హర్ష కుమార్ తెలిపారు. ఈ మేరకు హర్ష ఒక వీడియో విడుదల చేసి పశ్చాతాప పడ్డారు. పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీకి పిలుపివ్వడంతో తనను అరెస్టు చేయడం బాధ అనిపించినా, పోలీసులు తనను గౌరవంగా చూశారన్నారు.
News April 25, 2025
తూ.గో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షునిగా తాళ్లపూడి వాసి

తూ.గో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షునిగా తాళ్లపూడి మండలం, పోచవరానికి చెందిన కాకర్ల వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు నాయకులు, కార్యకర్తలు వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా చేస్తానని ఆయన అన్నారు.
News April 25, 2025
రాజమండ్రి : ‘ప్రేమించి.. ఇప్పుడు వద్దంటున్నాడు’

విజయనగరానికి చెందిన యువకుడు తనను ప్రేమించి మోసం చేశాడంటూ రాజమండ్రి యువతి పోలీసులను ఆశ్రయించింది. RJY దేవీచౌక్ సమీపంలోని ఓ కోచింగ్ సెంటర్లో రాంబాబు కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ పొందుతున్నాడు. అదే కోచింగ్ సెంటర్‌కు వెళ్తున్న యువతి (20)తో ప్రేమ వ్యవహారం నడిపాడు. శారీరంగా లోబర్చుకుని పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో అవమానించాడని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.