News March 24, 2025

రాజమండ్రి: 27న ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు

image

జిల్లాలో వివిధ కారణాలు వల్ల ఖాళీగా ఉన్న 12 ఉపసర్పంచ్ పదవులకు ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీపీవో శాంతామణి అన్నారు. రాజమండ్రి డివిజన్‌లో మల్లవరం, పాతతుంగపాడు, లక్ష్మినరసాపురం, మర్రిపూడి, మురమండ, మునికుడలి, కొవ్వూరు డివిజన్‌లో పెనకనమెట్ట, కొవ్వూరుపాడు, గోపాలపురం, వెంకటాయపాలెం, తాడిపూడి, ఉంద్రాజవరం పంచాయతీల ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. EOPR&RD ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.

Similar News

News March 31, 2025

KKD: తుది జట్టు నుంచి రాజును తప్పించిన ముంబై

image

కాకినాడ యువ క్రికెటర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్లో తుది జట్టు నుంచి తప్పించింది. తొలి రెండు మ్యాచ్‌లకు అవకాశం ఇచ్చి మూడో మ్యాచ్లో పక్కన పెట్టింది. కేకేఆర్ మ్యాచ్‌లో రాజు స్థానంలో అశ్విని కుమార్‌ను బరిలోకి దింపింది. కాగా సత్యనారాయణ రాజు రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఒక వికెట్ తీశారు.

News March 31, 2025

అర్ధరాత్రి కారు వీరంగం.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

రాజమండ్రి రూరల్ కొంతమూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాజీపేటకి చెందిన ఈర్లు నాగబాబు (44) ర్యాపిడో బైక్ టాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అర్ధరాత్రి బైక్ రైడ్‌లో ఉండగా మనీష్ ఫంక్షన్ హాల్ వద్ద మద్యం మత్తులో కారులో నలుగురు వేగంగా వచ్చి బైక్‌ని ఢీకొట్టారు. దీంతో నాగబాబుతో పాటు వెనక కూర్చున్న కస్టమర్ వీరబాబు(28) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

News March 31, 2025

రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

image

బైక్‌పై రాజమండ్రిలోని అత్తారింటికి శుభకార్యానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. JRG(M) లక్కవరానికి చెందిన నాగేశ్వరరావు తన భార్య రమణమ్మ, కొడుకు షణ్ముఖ్, కుతూరు జాహ్నవితో కలిసి బైక్‌పై బయలుదేరారు. సీతంపేట వద్ద రోడ్డు అంచున ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో వీరనాగేశ్వరరావు మృతి చెందారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI చంద్రశేఖర్ తెలిపారు.

error: Content is protected !!