News January 27, 2025
రాజమండ్రి: PGRSకు 17 అర్జీలు

రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహిచిన ‘పి.జి.ఆర్.ఎస్ – మీ కోసంలో’ ప్రజల నుంచి 17 అర్జీలను నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి అదనపు కమిషనర్ ఎస్.వెంకటరమణ, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వినూత్న సంయుక్తంగా స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అర్జీదారులకు తెలిపారు. కార్యక్రమంలో ఎస్.ఈ జి.పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 13, 2025
చాగల్లు: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన దుర్గాభవాని(35), వివాహిత కుమార్తె కుమారుడు సంతానం ఇటీవల ఆర్థిక ఇబ్బందులు కారణంగా మనస్థాపానికి గురై గురువారం ఆమె పిల్లలతో మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకోంది. చికిత్స నిమిత్తం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్సై నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 13, 2025
తూ.గో జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్ల రాకపోకలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14,16,21,23 తేదీలలో జిల్లా మీదుగా పలు రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 14, 21 తేదీలలో చర్లపల్లి – కాకినాడ టౌన్(070310),16,23 తేదీలలో కాకినాడ టౌన్ చర్లపల్లి(07032) రైళ్లు నడవనున్నాయని తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
News February 13, 2025
తూ.గో: నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్

బర్డ్ ఫ్లూ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. కోళ్ల రైతులు, పెంపకందారులు బెంబేలెత్తిపోతున్నారు. బర్డ్ ఫ్లూ నాటుకోళ్లపై కూడా తాజాగా ప్రభావం చూపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా కానూరు అగ్రహారంలో కోళ్ల ఫారాల్లో కోళ్లన్నీ చనిపోయాయి. వైరస్ కానూర్ అగ్రహారంలో నాటుకోళ్లకూ సోకింది. అక్కడ వ్యాధి సోకిన నాటుకోళ్లను పూడ్చివేశారు. దాదాపు 500 నాటుకోళ్లు చనిపోయాయి.