News August 3, 2024
రాజమండ్రి: YCP కార్యాలయం కూల్చివేత ఉత్తర్వులు రద్దు

రాజమండ్రిలో YCP భవనం కూల్చివేతకు మున్సిపల్ కమిషనర్ జులై 22న ఉత్తర్వులిచ్చారు. దీనిని సవాల్ చేస్తూ YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి, YCP జిల్లాధ్యక్షుడు జక్కంపూడి రాజా హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. మున్సిపాలిటీ నుంచి అనుమతి కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. ఆ దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది.
Similar News
News October 22, 2025
స్త్రీ శక్తి పథకం మరింత ముందుకు తీసుకువెళ్లాలి: DPTO

‘స్త్రీ శక్తి’ పథకం మరింత ముందుకు సాగేందుకు ఆర్టీసీ సిబ్బంది, అద్దె బస్సుల యజమానులు సహకరించాలని డీపీటీఓ వైఎస్ఎన్ మూర్తి కోరారు. బుధవారం రాజమండ్రి కార్యాలయంలో డిపో మేనేజర్లు, అద్దె బస్సుల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. పథకం విజయానికి ఆర్టీసీ బస్సులతో పాటు అద్దె బస్సుల పాత్ర కూడా ముఖ్యమన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా నిర్ణీత సమయంలో గమ్యానికి చేర్చాలని సూచించారు.
News October 22, 2025
96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలు: కలెక్టర్

ఈ నెల 23 నుంచి 30 వరకు జిల్లాలోని 96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. 5 నుంచి 17 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ నవీకరణ జరుగుతుందన్నారు. ఆధార్ రికార్డులు అప్డేట్ చేసుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు, పథకాలు, విద్యా అవకాశాలను పొందగలుగుతారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 22, 2025
గోదావరి తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

రాగల 24 గంటల్లో వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ తీర మండలాలు, లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాలు, నదీ పరివాహక మండలాల్లోని తక్కువ ఎత్తులో ఉన్న గ్రామాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు, అవసరమైతే తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.