News November 13, 2024
రాజమహేంద్రవరం-అనకాపల్లి హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఎంపీ
రాజమహేంద్రవరం-అనకాపల్లి జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. జాతీయ రహదారి-16 పరిధిలోని అనకాపల్లి- అన్నవరం-దివాన్ చెరువు సెక్షన్లలోని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరించడానికి డీపీఆర్‌లను కేంద్రం సంబంధిత కన్సల్టెంట్‌కు అందజేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 11, 2024
విశాఖ: విజయవంతమైన వెల్ డెక్ రికవరీ ట్రయల్స్
విశాఖ తీరంలో నిర్వహించిన వెల్ డెక్ రికవరీ ట్రయల్స్ విజయవంతమైనట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. నావికాదళం సహకారంతో ఈనెల 6వ తేదీన గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా క్రూ మాడ్యూల్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు అక్కడ విధులు ముగించుకుని క్రూ మాడ్యూల్లోనే భూమిపైకి తిరిగి వస్తారు. వీటిని సముద్రంలోకి పడేటట్లు చేస్తారు. అక్కడనుంచి వ్యోమగాములు సురక్షితంగా వస్తారు.
News December 11, 2024
సింహాచలం: 12 నుంచి రెండవ విడత నృసింహ దీక్షలు
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో రెండవ విడత నృసింహ దీక్షలు 12వ తేదీన ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి దీక్షలు తీసుకుంటున్న భక్తులకు ఆలయ వైదికలు మాలాధారణ చేయనున్నట్లు తెలిపారు. దీక్షలు స్వీకరించే భక్తులకు తులసిమాలలు, స్వామివారి ప్రతిమలను ఉచితంగా అందజేస్తామన్నారు. 32 రోజుల తర్వాత వచ్చే నెల 12న మాల విసర్జన జరుగుతుందన్నారు.
News December 11, 2024
విశాఖ: రద్దీ కారణంగా పలు స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డిసిఎం కె సందీప్ పేర్కొన్నారు. త్రివేండ్రం నార్త్-షాలిమార్ కొచ్చువేలి స్పెషల్ ట్రైన్ వచ్చే నెల 24వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే తిరునల్వేలి-షాలిమార్-తిరునల్వేలి ప్రత్యేక రైలు, పొదనూర్-బరౌని పొదనూర్ స్పెషల్ ట్రైన్, తాంబరం-సంత్రగచ్చి-తాంబరం స్పెషల్ పొడిగించామన్నారు.