News October 21, 2024

రాజమహేంద్రవరం: పోలీసు అమరవీరులకు నివాళి

image

రాజమహేంద్రవరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలను పోలీసు అధికారులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ కిషోర్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 7, 2024

రాజమండ్రి ఎయిర్ పోర్టులో బుల్లెట్లు కలకలం

image

రాజమండ్రి ఎయిర్పోర్టులో బుల్లెట్లు కలకలం రేపాయి. రాజమండ్రి టు హైదరాబాద్‌కు వెళ్తున్న ప్యాసింజర్ బ్యాగ్‌ను పోలీసులు ఈ రోజు ఉదయం తనిఖీ చేయగా ఆరు బుల్లెట్లు లభ్యమయ్యాయి. ప్రయాణికుడు ఎయిర్ పోర్టు నిబంధనలు పాటించకపోవడంతో అతడిపై చర్యలకు సిద్ధం అయ్యారు. ఎయిర్ పోర్ట్ నిబంధనలు మేరకు ప్రయాణికులు నడుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 7, 2024

అమలాపురంలో అమెరికా అధ్యక్షుల నాణేలు

image

అమలాపురంలో నాణేల సేకరణ కర్త పుత్స కృష్ణ కామేశ్వర్ ఇంట అమెరికా అధ్యక్షుల నాణేలు దర్శనమిచ్చాయి. అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తులపై డాలర్ విలువైన నాణేలను అమెరికన్ మింట్లు 2007 నుంచి విడుదల చేస్తున్నాయి. 2007 నుంచి 2011వరకు ఈ నాణేలు పెద్ద సంఖ్యలో చెలామణి కోసం ముద్రించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రెసిడెంట్ డాలర్స్ అన్నింటిని సేకరించగా.. 2012 నుంచి 2017వరకు, సిరీస్‌లోని కొత్త నాణేలను ఆయన విడుదల చేశారు.

News November 7, 2024

రాజమండ్రి: ‘అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు’

image

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇసుక కార్యకలాపాలు చేయటం నిషేదమని జిల్లా కలెక్టర్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు నిర్వహించరాదని, అనుమతి పత్రాలు లేకుండా రవాణా చేస్తే శిక్షార్హులు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామాన్య అవసరాలకు మించి ఇసుక అక్రమ నిల్వలు చేయరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.