News October 8, 2024
రాజరాజేశ్వరి దేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 6వ రోజు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లీ, రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. ‘రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుందని నమ్మకం’ అని పూజారి వివరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
HYD: KPHBలో విదేశీ యువతులతో వ్యభిచారం.. జైలు శిక్ష

KPHB PS పరిధిలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహించిన నిర్వాహకుడికి కూకట్‌పల్లి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ముఠాను అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు రిపాన్‌తో పాటు బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. సివిల్ జడ్జి సంధ్యారాణి విచారణ చేపట్టి శిక్ష ఖరారు చేసి తీర్పు ఇచ్చారు.
News November 22, 2025
HYD: బీసీ కమిషన్ రిపోర్ట్‌కు కేబినెట్ ఆమోదం

తెలంగాణలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదిక ఆధారంగా పంచాయతీ రాజ్ శాఖ నేడు జీవోను విడుదల చేయనుంది. జిల్లా కలెక్టర్లు నవంబర్ 23వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించారు. పూర్తి నివేదికను పంచాయతీ రాజ్ శాఖ నవంబర్ 24వ తేదీన కోర్టుకు సమర్పించనుంది. ఈ నిర్ణయం ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నారు.
News November 22, 2025
HYDలో అతి పెద్ద పౌల్ట్రీ ఎక్స్‌పో

దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ ‘పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్-2025’కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 25 నుంచి హైటెక్స్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ ఎక్స్‌పో జరగనుంది. సుమారు 50 దేశాల నుంచి 500కు పైగా ఎగ్జిబిటర్లు, 40వేల మంది సందర్శకులు హాజరుకానున్నారు. సస్టెయినబుల్ ఫీడ్, ఆటోమేషన్ వంటి అంశాలపై చర్చిస్తారు.


