News February 23, 2025
రాజలింగమూర్తి హత్య ఘటనలో ఏడుగురు అరెస్ట్

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నాగవెల్లి రాజలింగమూర్తి హత్య ఘటనలో 10 మందిపై కేసు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారిలో బీఆర్ఎస్ ముఖ్యనేత కొత్త హరిబాబు ఉన్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Similar News
News March 22, 2025
ఉమ్మడి కరీంనగర్: వర్షానికి నేలకు కూలిన మొక్కజొన్న పంటలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలకు ఒరిగింది. పలుచోట్ల వరద నీరు చేరి పంట నీట మునిగింది. చేతికి అందిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తగినంత నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
News March 22, 2025
ట్రంప్ ఎఫెక్ట్..5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ రద్దు

USAలో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన దాదాపు 5.30 లక్షల మంది పౌరులు అమెరికా వీడనున్నారు. వచ్చే నెల 24తో వారి లీగల్ స్టేటస్ రద్దవుతుంది. యుద్ధం లేదా ఇతర కారణాలతో అనిశ్చితి నెలకొన్న దేశాలకు చెందిన పౌరులకు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం కల్పిస్తారు.
News March 22, 2025
గుంటూరు హైవేపై ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

గుంటూరు జాతీయ రహదారిపై, అద్దంకి వెళ్లే మార్గంలో మేదరమెట్ల వద్ద శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయం కావడంతో మరణించిన వ్యక్తి వివరాలు, వాహనం ఆనవాళ్లు లభించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.