News February 23, 2025

రాజలింగమూర్తి హత్య ఘటనలో ఏడుగురు అరెస్ట్

image

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నాగవెల్లి రాజలింగమూర్తి హత్య ఘటనలో 10 మందిపై కేసు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారిలో బీఆర్ఎస్ ముఖ్యనేత కొత్త హరిబాబు ఉన్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Similar News

News October 30, 2025

కామారెడ్డి: ఉజ్వల కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాకు కొత్తగా 284 ఉజ్వల కనెక్షన్లు మంజూరైనట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం ఉజ్వల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిపిఎల్ కుటుంబాలు, గ్యాస్ కనెక్షన్ లేనివారు మాత్రమే అర్హులన్నారు. అర్హత గల లబ్ధిదారులు వెంటనే డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకోవాలని సూచించారు.

News October 30, 2025

అక్టోబర్ 30: చరిత్రలో ఈరోజు

image

1883: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి మరణం
1909: భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా జననం (ఫొటోలో)
1945: ఐక్యరాజ్యసమితిలో భారత్ సభ్య దేశంగా చేరింది
1987: సినీ దర్శకుడు రాజాచంద్ర మరణం
1990: దర్శకుడు, నిర్మాత, నటుడు వి.శాంతారాం మరణం
✒ ప్రపంచ పొదుపు దినోత్సవం

News October 30, 2025

మెడికల్ కాలేజీలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ కోర్సుల్లో సీట్ల భర్తీకై అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్రీహరి రావు తెలిపారు. DMLT 30 సీట్లు, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ 30 సీట్లు కోర్సులకు ఇంటర్‌లో BIPC, MPC, ఆర్ట్స్ గ్రూప్ చదివిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తులను నవంబర్ 27వ తేదీ వరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో అందజేయాలని ఆయన సూచించారు.