News April 11, 2025
రాజవొమ్మంగి: ఇద్దరికి తీవ్రగాయాలు.. రెండు గెదేల మృతి

రాజవొమ్మంగి మండలం దూసారపాము గ్రామం శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పాకవెల్తి గ్రామానికి చెందిన ముర్ల నాగేష్, గోవింద్ తీవ్రంగా గాయపడ్డారని 108సిబ్బంది అర్జున్, గంగరాజు తెలిపారు. కాకరపాడు నుంచి పాకవెల్తి వైపు బైక్‌పై వెళుతుండగా హైవేపై ఉన్న గేదెలను ఢీకొని కిందపడ్డారు. స్పాట్‌లో రెండు గేదెలు మృతి చెందాయని, క్షతగాత్రులను రాజవొమ్మంగి పిహెచ్సీకి తరలించామని తెలిపారు.
Similar News
News April 11, 2026
పాలేరు జలాశయంలో 15 కేజీల జెల్ల చేప

కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో శనివారం ఓ మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన జూలూరి రాములు ఉదయం చేపల వేటకు వెళ్లగా, ఆయన వలలో 15 కేజీల పంకజ జెల్ల పడింది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద చేప దొరకడం అరుదని, దీని ధర మార్కెట్‌లో కిలోకు రూ.80 నుంచి రూ.120 వరకు ఉంటుందని మత్స్యకారుడు హర్షం వ్యక్తం చేశారు.
News April 11, 2026
సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.
News April 11, 2026
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికం ఇక్కడే

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. గతంతో పోలిస్తే సమాన స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ప్రజలు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. అధికారులు వెల్లడించిన వివరాలు.. మెండోరా, భీమ్గల్ 41.6°C, వేంపల్లి బాల్కొండలో 41.5,°C లు నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలోని సగం ప్రాంతాల్లో 40°C లకు పైగా రికార్డ్ అయ్యాయి. అటు కామారెడ్డి జిల్లాలో సైతం సోమూర్ 40.3°C, భిక్కనూరు 40.2°C లు నమోదయ్యాయి.


