News December 19, 2024
రాజాంలో నేడు నీటి సరఫరా బంద్

రాజాం పరిధిలోని పాలకొండ రోడ్డులో పైప్లైన్ మరమ్మతుల కారణంగా గురువారం నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొనుగుట్టువలస, అంబేద్కర్ కాలనీ, విద్యానగర్, వరలక్ష్మి నగర్, మారుతి నగర్ ప్రాంతాలలో నీటిసరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
Similar News
News November 11, 2025
విశాఖపట్నంలో గార మండల యువకుడు ఆత్మహత్య

విశాఖపట్నంలో గార మండలం కొర్లాం గ్రామానికి చెందిన యువకుడు నల్ల సంపత్ కుమార్ (32) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. యువకుడు విశాఖ ద్వారక నగర్లో ఓ గదిలో అద్దెకి ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురైన అతను ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది.
News November 11, 2025
ఆత్మహత్య ఘటనలో ఇద్దరికి రిమాండ్: ఎస్ఐ

నందిగం మండలం తురకలకోట గ్రామానికి చెందిన ఎం.వెంకటరావు(34) అనే వ్యక్తి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు నందిగం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరావును వేధించిన పెట్రోల్ బంక్ యజమాని బీ.రమేశ్తో పాటు అతనికి సహకరించిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఇరువురుని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నందిగం ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.
News November 11, 2025
SKLM: పిల్లలు దత్తత కావాలా.. ఐతే ఇలా చేయండి

అర్హులైన తల్లిదండ్రులు మిషన్ వాత్సల్య వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటే పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో దత్తత ప్రక్రియపై కరపత్రాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని విమల ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. www.missionvataslya.wcd.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేయాలన్నారు.


