News July 7, 2024
రాజాం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
మానసిక పరిస్థితి బాగలేకపోవడంతో రాజాం మండలం పరశురాంపురం గ్రామానికి చెందిన బెవర అప్పలరాము పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు రాజాంలోని సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. భార్య అన్నపూర్ణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 12, 2024
శ్రీకాకుళం: IIITలో చనిపోయింది ఎవరంటే..?
శ్రీకాకుళం జిల్లా ఎస్ఎంపురం IIIT క్యాంపస్‌లో ఓ విద్యార్థి చనిపోయిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు(M) పీఆర్సీ తండాకు చెందిన రమావత్ నాయక్, విజయబాయి కుమారుడు ప్రవీణ్ నాయక్(18) సివిల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను హాస్టల్ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయాడు. రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ మేరకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
News December 12, 2024
ఆ విషయాన్ని జగన్ కూడా అంగీకరించారు: ధర్మాన
మాజీ మంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పవన్, TDP, బీజేపీ ఏకమైనా గత ఎన్నికల్లో మాకు(YCP) 40 శాతం ఓట్లు వచ్చాయి. కూటమి ఇచ్చిన హామీలు నమ్మి పేదలు అత్యాశకు పోయి తప్పు చేశారు. మేము కార్యకర్తలను విస్మరించిన మాట కొంత వరకు నిజమే. ఇదే విషయాన్ని జగన్ కూడా అంగీకరించారు. భవిష్యత్తులో వారికి అండగా ఉంటూ ముందుకెళ్తాం’ అని నిన్న టెక్కలిలో జరిగిన వైసీపీ ఆఫీస్ ప్రారంభ వేడుకల్లో వ్యాఖ్యానించారు.
News December 12, 2024
SKLM: చంద్రబాబు కృషి ఎంతో ఉంది: మంత్రి
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం హైదరాబాద్ శంషాబాద్లోని నోవాటెల్లో ఎయిర్ పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అప్పట్లో 5వేల ఎకరాల భూసేకరణ అంటే సామాన్యమైన విషయం కాదన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని తెలిపారు.