News March 5, 2025

రాజాం: భోజనం చేసి కుప్పకూలిపోయిన యువకుడు

image

అకస్మాత్తుగా గుండె పోటుతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రాజాం మున్సిపాలిటీ పరిధిలో గాయత్రీ కాలనీకి చెందిన శ్రీనివాస్(30) భోజనం చేసిన కాసేపటికే కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 13, 2025

విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

image

మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం వద్ద ఆటోలో ప్రమాదకర స్థితిలో వెళ్తున్న మోడల్ స్కూల్ విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆటోను ఆపి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమయానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ ఆర్టీసీ డిపో అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందన పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

News November 13, 2025

విశాఖ: ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం

image

విశాఖలో ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.82వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ పవర్ సంస్థ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకుంది. పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో రెన్యూ పవర్ సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఎంఓయూల ద్వారా 10 వేలకు పైగా ఉద్యోగాలకు అవకాశం లభించనుంది.

News November 13, 2025

నిడమర్రు: రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

image

నవంబర్ 8-10 వరకు విజయవాడలో జరిగిన అంతర్ రాష్ట్ర అండర్-17 హ్యాండ్ బాల్ పోటీలకు నిడమర్రులోని చానమిల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని బత్తిన ధరణి ప్రియ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 11,12 తేదీల్లో జరిగిన సివిల్ సర్వీసెస్ వాలీబాల్, బాస్కెట్ బాల్ టీంకి జిల్లా నుంచి వ్యాయామ ఉపాధ్యాయురాలు వలపుల సౌజన్య రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఇరువురిని MEO-2 శేషగిరి రావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.