News March 5, 2025
రాజాం: భోజనం చేసి కుప్పకూలిపోయిన యువకుడు

అకస్మాత్తుగా గుండె పోటుతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రాజాం మున్సిపాలిటీ పరిధిలో గాయత్రీ కాలనీకి చెందిన శ్రీనివాస్(30) భోజనం చేసిన కాసేపటికే కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 17, 2026
VZM: స్వయంగా స్వీయ గణన పూర్తి చేసిన కలెక్టర్

జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్వీయ గణన ప్రక్రియను గురువారం పూర్తి చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌకర్యం ద్వారా ప్రజలు అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవాలని అన్నారు.

జలధారతో భూగర్భ జలమట్టం పెంచాలి: కలెక్టర్

విజయనగరం జిల్లాలో జలధార-నీటి భద్రత కింద చేపడుతున్న పనుల ద్వారా భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం వర్చువల్‌గా మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 215 ప్రాధాన్యత గ్రామాల్లోని 1,679 చెరువులకు అంచనాలు సిద్ధం చేసి పంపాలని, జిల్లాలోని 8,010 చెరువులకు పనులు గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పనులను ఉపాధి హామీ పథకం కింద నమోదు చేయాలన్నారు.