News August 15, 2024
రాజాం: సూక్ష్మ స్వర్ణ భారతం తయారుచేసిన స్వర్ణకారుడు

రాజాం పట్టణం కాస్పావీధికి చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ స్వర్ణ కళాకారుడు ముగడ జగదీశ్ మరోసారి ప్రతిభ కనబరిచారు. 0.060 మిల్లీ గ్రాముల బంగారు తీగతో సూక్ష్మ స్వర్ణ భారతంను 30 నిముషాల వ్యవధిలో తయారుచేసి ఔరా అనిపించాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీనిని తయారుచేసి దేశ భక్తిని చాటుకున్నాడు. అనేక కళాకృతులు అందంగా తయారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
Similar News
News May 7, 2025
శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి అభినందనలు

నేడు సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన విజయవంతం చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం విశేష కృషిచేశారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. బుడగట్లపాలెం సముద్ర తీర ప్రాంతంలో అనువైన పరిస్థతిని కల్పించి మత్య్సకారులతో సీఎం నేరుగా మాట్లాడేందుకు అవకాశం దక్కిందన్నారు.
News May 7, 2025
పలాస: మృతదేహం కోసం ఐదు రోజులుగా ఎదురుచూపులు

ఉపాధి కోసం పోలాండ్ దేశానికి వెళ్లిన పలాస(M) ఖైజోల గ్రామానికి చెందిన బుడత దామోదర్(33) మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఈ నెల 21న మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఇప్పటికి 5 రోజులు గడిచినా మృతదేహం స్వగ్రామానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తక్షణమే అధికారులు, నాయకులు స్పందించి మృతదేహం స్వగ్రామానికి చేరేలా చర్యలు తీసుకోవాలని బంధువులు వేడుకుంటున్నారు.
News May 7, 2025
శ్రీకాకుళం జిల్లాకు వరాలు కురిపిస్తారా?

మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేడు CM చంద్రబాబు జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు నెలకొల్పి వలసలు అరికట్టేలా ఏదైనా ప్రకటన చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. పైడిభీమవరంలో పారిశ్రామికవాడ, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, కొవ్వాడ అణువిద్యుత్ పరిశ్రమ పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.