News December 17, 2024

రాజాం: Way2News కథనానికి స్పందన

image

 రాజాం మండలం <<14900613>>గెడ్డవలస<<>>లోని గ్రామస్థులు విషజ్వరాల బారిన పడ్డారని  Way2News లో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎంపీడీఓ శ్రీనివాసరావు  గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం వైద్యులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలువురిని పరీక్షించారు. ఎంపీడీఓ గ్రామంలో పర్యటించి జ్వర పీడితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇవి అదుపులోకి వచ్చేంత వరకు శిబిరం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.  

Similar News

News February 27, 2026

SKLM: డయేరియా ప్రాంతంలో కఠిన నిబంధనలు

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ గురువారం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. మంగువారితోట దమ్మలవీధి కాకివీధి మేదరివీధి ప్రాంతాల్లో డయేరియా అదుపులోకి వచ్చినంత వరకు మాంసం విక్రయాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 27, 2026

శ్రీకాకుళం: డయేరియాపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తాగునీరు, మురికి కాలువల నిర్వహణ, పరిశుభ్రత విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.