News September 14, 2024

రాజానగరంలో తీవ్ర విషాదం

image

రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. టీ పొడి అనుకుని పొరపాటున వృద్ధ దంపతులు పురుగు మందు వేసుకొని టీ తాగారు. ఈ ప్రమాదంలో వెలుచూరి గోవింద్(75), అప్పాయమ్మ (70) మృతి చెందారు. అప్పాయమ్మకు కంటి చూపు తక్కువగా ఉండడంతో పొలాలకు చల్లే గుళికల ప్యాకెట్‌ను టీ ప్యాకెట్‌గా భావించి టీ పెట్టుకొని తాగారు. కొద్దిసేపటికే నోటి నుంచి నురగలు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News October 14, 2024

అమలాపురం: 133 మద్యం షాపులకు 4,087 దరఖాస్తులు

image

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మద్యం పాలసీకి సంబంధించి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 133 షాపులకు గాను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 4,087 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్‌లో అభ్యర్థుల సమక్షంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.

News October 13, 2024

తూ.గో జిల్లా వ్యాప్తంగా 253 గ్రామాలలో పంచాయతీ వారోత్సవాలు

image

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 253 గ్రామ పంచాయతీలలో పంచాయతీ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ నుంచి ఆమె ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ పంచాయతీ వారోత్సవాలు జరుగుతాయని ఆమె తెలిపారు.

News October 13, 2024

రంప: పర్యాటక ప్రాంతాలు మూసివేత

image

ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలు ముసివేస్తున్నామని ITDA PO కట్టా సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండ వాగులు, కాలువలు, జలపాతాలు పొంగి ప్రవహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో పర్యాటకులు ఏజెన్సీకి రావద్దని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.