News October 1, 2024

రాజానగరం: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్

image

నన్నయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోని భర్తీ చేయని సీట్లకు ఈనెల 5న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాలలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.

Similar News

News October 2, 2024

కోనసీమ: పట్టభద్రులూ.. ఓటు నమోదు చేసుకోండి

image

గతంలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు నమోదు చేసుకున్న ఓటు ప్రస్తుతం ఉండదని ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని మండపేట ఎన్నికల డీటీ అవతార్ మెహర్ బాబా పేర్కొన్నారు. మండపేట తహశీల్దార్ కార్యలయంలో మంగళవారం రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021 అక్టోబర్ 31 నాటికి పట్టభద్రులైన వారు ఓటరుగా నమోదయ్యేందుకు అర్హులన్నారు.

News October 1, 2024

కోనసీమ: బాలికపై లైంగిక దాడి.. యువకుడి రిమాండ్

image

బాలికపై లైంగిక దాడి కేసులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణానికి చెందిన వెంకటకృష్ణను అరెస్టు చేసినట్లు CI అశోక్ కుమార్ తెలిపారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థిని(17)పై ప్రేమ పేరిట లైంగిక దాడికి పాల్పడిన నేరంపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు. AUG 16న బాలిక ఒంటరిగా ఉండగా, వెంకటకృష్ణ మద్యం తాగి లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. నిందితుడికి కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.

News October 1, 2024

తూ.గో: కొండ వాగులో బాలుడి మృతదేహం లభ్యం

image

అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విగత జీవిగా వాగు నీటిలో తేలడం చూసి ఆ తల్లిదండ్రుల హృదయం ముక్కలైంది. తూ.గో జిల్లా సీతానగరానికి చెందిన పదో తరగతి విద్యార్థి వినయ్(15) కొండ గోదావరి వాగులో ఆదివారం <<14229819>>గల్లంతైన విషయం<<>> తెలిసిందే. గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం మృతదేహం లభ్యమైంది. స్నేహితులతో కలిసి సరదాగా ఫొటోషూట్‌కి వెళ్లిన కొడుకు శవమై ఇంటికి రావడంతో తల్లి వరలక్ష్మి, తండ్రి శ్రీనివాస్ బోరున విలపించారు.