News October 1, 2024
రాజానగరం: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్
నన్నయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోని భర్తీ చేయని సీట్లకు ఈనెల 5న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాలలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.
Similar News
News October 11, 2024
రాజమండ్రి: ప్రజలకు దశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రశాంతి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని నవరాత్రుల సందర్భంగా ప్రతి ఇంట అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తూ దసరా వేడుకలను జరుపుకుంటామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.
News October 11, 2024
రంప: ఆకట్టుకుంటున్న పెద్ద పుట్టగొడుగు
రంపచోడవరం నియోజకవర్గం విఆర్‌పురం మండలం ఉమ్మిడివరం గ్రామంలో భారీ పుట్టగొడుగు ఆకట్టుకుంటుంది. సాధారణంగా పుట్ట గొడుగు 2 నుంచి 4 అంగుళాలు ఎత్తుకు ఎదిగింది. ఈ పుట్ట గొడుగు 2 అడుగులు ఎత్తు, 3 అడుగుల వెడల్పు గులాబీ రంగులో, ఎరుపు మచ్చలతో ఆకర్షనీయంగా ఉంది. స్థానికులు పుట్ట గొడుగుని ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో ఎన్నడూ భారీ పుట్ట గొడుగు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
News October 11, 2024
తూ.గో: పిడుగులు పడే ప్రమాదం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు పిడుగుల ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. కాకినాడ రూరల్, తుని, కోనసీమ, పెద్దాపురం, సామర్లకోట, రంపచోడవరం, మారేడుమిల్లి, రాజానగరం రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో పిడుగులు ప్రమాదం ఉందని ఫోన్‌లకు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.